Holy Land Tours in Jerusalem

Holy Land Tours in Jerusalem ఈ లోకంలో జీవము కలిగినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడు మానవుడే. ఈ జ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. అనాది కాలం నుండి ఈ 21వ శతాబ్దపు మానవుని జీవనా విధానంలొ ఆధునికతకు అవధులు లేని ఎన్నో మార్పులు. సామాజిక సామాన్య తత్వ శాస్త్రాలలొ మానవుని జ్ఞానం అంతా ఇంతా కాదు. ఈ విజ్ఞాన తత్వశాస్త్రం బాగా తెలిసి తనను ఎవరు సృష్టించారో కూడా తెలుసుకోలేనంత స్థితి. మానవుడు ఓ రసాయనిక చర్య అని, సూక్ష్మ కణం నుండి ఉద్భవించాడు అని ఎన్నో వాదనలు. లేదండి, మానవుడు దేవుని స్వరూపంలో, పోలికలో మంటితో చేయబడ్డాడు; వాని నాసికారంద్రములొ జీవ వాయువు ఊదగా నరుడు జీవాత్మాయెను అని పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ చెబుతుంది అంటే, కాదు అసలు దేవుడే లేడు అని వాదించే నాస్తికులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అలా పక్కన పెడితే అందరు నమ్మేది మాత్రం జీవము అనేది ఉంది అని మాత్రం చెప్పగలం.

ఈ లోకములో జీవము అనే మాటకు నాలుగు ప్రశ్నలు కలవు. దాని మూలము అర్ధం నైతికత గమ్యం ఏంటి ?. జీవము అనేది ఉంది అని నమ్ముతే ఈ నాలుగు ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఉండ వలసినదే. మన జీవితం ఎక్కడనుండి ఆరంభమైనది, ఎందుకు మనము జీవిస్తున్నాము అంటే అర్ధవంతమైన జీవితము జీవిస్తున్నామా మన జీవిన నైతిక విలువలు ఏంటి మరియు ఈ జీవితానికి అంతం ఏంటి అనే ఈ నాలుగు ప్రశ్నలను మనము వ్యక్తిగతంగా వేసుకోవాలి. వీటన్నింటికీ సమాధానం మీ వద్ద ఉంటే దేవుడు ఉన్నాడు అని మీరు విశ్వసించినట్లే. ఓ సూక్ష్మకణం నుండి ఆవిర్భవించినది ఈ జీవితము అని మీ సమాధానం అయితే ఆ అణువు యొక్క మూలము కూడా చెప్పాలి మరి. ఏ వాదనయైనా తార్కికంగా నిలకడగా ఉండాలి, తగినంత అర్ధవంతంగా ఉండాలి, ఉన్నది అని ఉనికి చాటాలి. అట్టి నాస్తిక వాదన ఈ జీవితానికి మూలం మరియు అంతం ఏంటో రుజువు చేయలేకపోయింది. వీటన్నిటికి కర్త ఎవరైనా ఉంటే అతడు ఆది అంతము లేని వాడై, ఈ జీవము పై సార్వభౌమాధికారము కలిగి యుండాలి. అట్టి ఉద్దేశమునకు అర్ధమిచ్చునది “దేవుడు” అను పదమే. యుగయుగములు జీవించువాడైన దేవునికి మరము పై విజయము కూడా కలదు అనుట సరియైనదే.

ఇట్టి నమ్మకము లేదా విశ్వాసము అర్ధవంతమైన నైతిక జీవితానికి నాంది. వీటిలో క్రైస్తవ విశ్వాసం గొప్పది. ఎందుకంటే ఓ మానవాతీతమైన మూలకం ఆవిర్భవించబోతుంది, ఆయన యేసు క్రీస్తుగా జన్మించి, మరణించి, పునరుర్ధానమావుతాడు అని కొన్ని శతాబ్దాల కాలం నుండి ప్రవచించబడింది. మరణపు ముల్లును విరువ గలిగిన శక్తిమంతుడైన క్రీస్తు పై విశ్వాసమే నిత్యమూ జీవిస్తాము అనే దృఢ నిశ్చయత కలుగ జేస్తుంది. ఒక వేళ క్రీస్తు శరీరము ఆ సమాధిలో ఇంకా ఉంటే క్రైస్తవ్యత్వం ఎప్పుడో కనుమరుగై పోయేది. నిజంగా క్రీస్తు మరణించి, మర్త్యమైన శరీరం అమర్త్యతలోనికి రూపాంతరము పొంది పరలోకానికి ఎత్తబడ్డాడు కాబట్టే మన విశ్వాసం సత్యమైనది బహుగా బలపడింది.

దాదాపు 1500 ఏండ్లు బైబిల్ వ్రాయబడింది. ఈ గ్రంధంలొ రుజువు చేయబడనివి కలవు అని రెండు వేల సంవత్సరాలు చేసిన పరిశోధనా విఫలమైంది. ఎందుకంటే ప్రాచీన దినములలో నిజముగా జరిగిన వాటినే సమకూర్చి లిఖితము చేసారు కాబట్టే ఎట్టి వాదనలైన ఈ చరిత్ర ముందు నిలబడలేకపోయాయి.

నిజంగా దేవుడున్నాడా? ఉంటే నాకు ఎందుకు కనబడుటలేదు? అంటూ మనకు మనమే ఓ ప్రశ్న వేసుకొని మనకు తగిన రీతిలో ఈ పని జరగాలి, దేవుడు నాకు ఇక్కడ ఇప్పుడే కనబడాలి అని ఉద్దేశాలు మనకు ఎన్నో. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి, పై తెలుపబడిన ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం మీ వద్ద ఉంటే క్రీస్తును గూర్చి క్షుణ్ణంగా తెలుసుకొనుటకు ప్రయత్నించండి. పరిశుద్ధ గ్రంధంలో ఉన్న సువార్తలే వాటికి ఆధారం. విశ్వాసంతో, తెరువబడిన హృదయంతో చదివి గ్రహించినట్లయితే అట్టి నమ్మకం వృధాకానేరదు. అట్టి అర్ధవంతమైన జీవితం జీవించడానికి సహాయపడుతుంది.

Share

Recommended Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

BIBLE QUIZ